Header Banner

ముందుగానే నైరుతి రుతుపవనాలు.. రెండు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

  Tue May 13, 2025 15:08        Entertainment

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) వేగంగా కదులుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే కేరళ (Kerala)ను తాకనున్నాయి. మంగళవారం సాయంత్రానికి దక్షిణ అండమాన్ సముద్రం (Andaman Sea) నికోబార్ (Nicobar) దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. ప్రస్తుతం అండమాన్‌–నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: ఘోర విషాదం.. కల్తీ మద్యం కలకలం.. 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం!

 

ఒక వైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. సోమవారం ఏపీలో 40 నుంచి 42 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పోగోదావరి జిల్లాల్లోని 29 మండల్లో తీవ్రంగా.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాలోని మరో 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపాయి. ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణశాఖ పర్కొంది. ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పదే అవకాశముందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. కాగా సోమవారం ఖమ్మంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rains #Telangana #Summer #Temperatures #IMD